కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన మహా సీఎం సతీమణి - maha cms wife admitted in hospital for covid-19 treatment
close
Updated : 31/03/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన మహా సీఎం సతీమణి

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి, సామ్నా సంపాదకురాలు రష్మీ ఠాక్రే కొవిడ్‌ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మార్చి 22న ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్న రష్మీ.. మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరినట్లు సీఎం కుటుంబం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు సీఎం కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా కొవిడ్‌ బారినపడ్డారు. ఈ నెల 11న ఉద్ధవ్‌ ఠాక్రే దంపతులు కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్న విషయం తెలిసిందే. 

రాష్ట్రంలో కాస్త తగ్గిన కేసులు..

మరోవైపు మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఇటీవల అత్యధికంగా 40వేలకు పైనే కేసులు వెలుగుచూడగా.. మంగళవారం 27,918 మందికి కొత్తగా వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27.73లక్షలకు పెరిగింది. ఇక నిన్న మరో 139 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 54,422 మంది వైరస్‌కు బలయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 3,40,542 క్రియాశీల కేసులున్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని