కొవిడ్‌ గుప్పిట్లో మహారాష్ట్ర - maha reports 9855 new covid-19 cases highest since october
close
Published : 04/03/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ గుప్పిట్లో మహారాష్ట్ర

అక్టోబరు తర్వాత మళ్లీ 10వేలకు చేరువలో కొత్తకేసులు

ముంబయి: దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బుధవారం అక్కడ రికార్డు స్థాయిలో 9,855 కొత్త కేసులు బయటపడ్డాయి. అక్టోబరు తర్వాత ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,79,185కి పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

చివరిసారిగా అక్టోబరు 17న రాష్ట్రంలో రోజువారీ 10వేలకు పైగా(10,259) కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన వైరస్‌.. ఇటీవల మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ముంబయి, పుణె, నాగ్‌పుర్‌, ఠాణెల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ముంబయిలో నిన్న 1,121 కొత్త కేసులు వెలుగుచూడగా.. పుణెలో 857, నాగ్‌పుర్‌లో 924, ఠాణెలో 818 మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. 

ఇక బుధవారం అక్కడ మరో 42 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 52,280 మంది కరోనాకు బలయ్యారు. మరోవైపు రికవరీల సంఖ్య కొత్త కేసుల కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6,559 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 20,43,349కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 82,343 యాక్టివ్‌ కేసులున్నాయి. క్రియాశీల కేసులు అత్యధికంగా పుణె జిల్లాలో 16,491గా ఉన్నాయి. ఆ తర్వాత నాగ్‌పుర్‌లో 10,132, ఠాణెలో 8,810 యాక్టివ్‌ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని