నా కుటుంబం.. నా బాధ్యత: ‘మహా’  సర్వే - maharashtra cm uddhav thackeray launches my family my responsibility campaign
close
Updated : 13/09/2020 19:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా కుటుంబం.. నా బాధ్యత: ‘మహా’  సర్వే

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం ‘నా కుటుంబ..నా బాధ్యత’ సర్వే చేపట్టనుంది. కొవిడ్‌ నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించటం దీని ముఖ్య ఉద్దేశం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే దీనిని ఆదివారం ప్రారంభించారు. రాబోయే రోజులలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కరోనాను నియంత్రించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని 22.5 మిలియన్‌ కుటుంబాలపై సర్వే నిర్వహించనున్నారు. సెప్టెంబరు 15న సర్వే ప్రారంభం అవుతుంది. ఇది రెండు దశలలో జరుగుతుంది. ఎన్జీవోలు, ప్రజాప్రతినిధులు దీని బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వాలంటీర్‌లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారు. జ్వరం, ఆక్సిజన్‌ స్థాయి, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తారు. సర్వే నిర్వహించే ప్రతి గ్రూప్‌లోనూ ఒక ఆరోగ్య కార్యకర్తతో పాటు మరో ఇద్దరు ఉంటారు. అవసరమైన సూచనలు ఇస్తారు. ప్రతి అయిదు గ్రూపులకు కలిపి ఓ వైద్యుడు ఉంటారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి స్వాబ్‌ టెస్టులు చేస్తారు. అందులో షుగర్‌, కిడ్నీ తదితర సమస్యలు ఉన్న వారికి చికిత్స తీసుకోవాలని సూచిస్తారు.

బృహన్‌ ముంబయిలో అలా..

పతి గృహ సముదాయంలో సహాయకులు, డ్రైవర్‌లు, చెత్తను సేకరించే వారికోసం థర్మల్‌ స్ర్కీనింగ్‌, ఆక్సిజన్‌ చెకప్, శానిటైజింగ్‌ వంటి సౌకర్యాలు కల్పించాలి. మున్సిపల్‌ హెల్త్‌ కేర్ సెంటర్లు, ఆసుపత్రులకు సంబంధించిన అత్యవసర నంబర్లను సముదాయం పరిసరాలల్లో అందరికీ కనిపించే ఏర్పాటు చేయాలి. దుకాణాల యజమానులు సైతం థర్మల్‌ స్క్రీనింగ్‌కు, శానిటైజింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. పరిమిత సంఖ్యలో మాత్రమే వినియోగదారులను అనుమతించాలి. కనీస సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని