65% కేసులు.. ఒక్క మహారాష్ట్రలోనే - maharashtra contributes 65 percent of new cases
close
Published : 18/03/2021 14:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

65% కేసులు.. ఒక్క మహారాష్ట్రలోనే

ముంబయి: దేశంలో తగ్గముఖం పట్టినట్లే కన్పించిన కరోనా మహమ్మారి.. ఇటీవల మళ్లీ కొమ్ములు పైకెత్తుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు 65శాతం కేసులు ఒక్క ఈ రాష్ట్రంలోనే ఉండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35,871 మంది వైరస్‌ బారిన పడగా.. ఇందులో 23,179 కేసులు(64.6శాతం) ఈ రాష్ట్రం నుంచే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. కొత్త కేసుల్లో 80శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే బయటపడుతున్నట్లు తెలిపింది. ఇక దేశంలో ప్రస్తుతం 2,52,364 యాక్టివ్‌ కేసులుండగా.. ఇందులో 1.52లక్షల క్రియాశీల కేసులు మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. 

85శాతం మరణాలు.. 5 రాష్ట్రాల్లోనే

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 172 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 84 మంది మరణించారు. రోజువారీ మరణాల్లో 85శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్కరోజే  పంజాబ్‌లో 35, కేరళలో 13, తమిళనాడులో 8, ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు కరోనాకు బలయ్యారు. 

18 రాష్ట్రాల్లో మరణాల్లేవ్‌..

గడిచిన 24 గంటల వ్యవధిలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనాతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. రాజస్థాన్‌, అసోం, చండీగఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, సిక్కిం, లద్దాఖ్‌, మణిపూర్‌, దాద్రానగర్‌ హవేలీ-దయ్యూదామన్‌, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్‌లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదుకాలేదు. మరోవైపు దేశంలో కరోనా మరణాల రేటు 1.39శాతంగా కొనసాగుతోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని