మహారాష్ట్రలో మరో 24,265 కొత్త కేసులు  - maharashtra corona cases update
close
Published : 22/03/2021 22:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో మరో 24,265 కొత్త కేసులు 

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా రికార్డులు బ్రేక్‌ చేసిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నాయి. గత 24 గంటల్లో 24,265 కొత్త కేసులు, 58 మరణాలు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటిదాకా మహారాష్ట్రలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 25,04,327కి చేరింది. వీరిలో 22,34,330 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 53,457మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 2.13శాతంగా ఉండగా.. రికవరీ రేటు 89.22శాతంగా ఉంది. మరోవైపు, ముంబయి నగరంలో ఈ రోజు 3,260 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరగడంపై మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపె ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలంతా తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించి లాక్‌డౌన్‌ విధించే అవకాశం రాకుండా జాగ్రత్తలు పడాలన్నారు.

మాస్క్‌ ధరించనివారి నుంచి రూ.44కోట్లు వసూలు
మునుపెన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో భారీగా కేసులు వెలుగుచూస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దేశంలోకి గతేడాది కరోనా వ్యాపించినప్పటి నుంచి మార్చి 20 వరకు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారిపై జరిమానా విధించడం ద్వారా రూ.44కోట్లు మేర వసూలు చేసినట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ముంబయి పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్లలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారి నుంచి ఈ మొత్తం వసూలు చేసినట్టు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని వారికి ఒక్కొక్కరికి రూ.200ల చొప్పున జరిమానా విధించిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని