అక్కడ ర్యాపిడ్‌ టెస్ట్‌ రూ. 150 - maharashtra govt slashes by half covid testing charges
close
Published : 01/04/2021 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్కడ ర్యాపిడ్‌ టెస్ట్‌ రూ. 150

కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర కీలక నిర్ణయం

ముంబయి: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మరోసారి మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ రుసుమును తగ్గిస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.150లకే ర్యాపిడ్ యాంటీజెన్‌ టెస్టు చేయనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతుండటంతో అధిక సంఖ్యలో ప్రజలు కొవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. దీంతో కరోనా నిర్ధారణ పరీక్ష ధరను తగ్గించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే తెలిపారు. అయితే ప్రస్తుతం రూ.500లకు ఆర్టీపీసీఆర్ టెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 39,544 కొత్త కేసులు నమోదయ్యాయి. 227 మంది కరోనా బాధితులు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 3,56,243 క్రియాశీల కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని