మహారాష్ట్రలో నిత్యావసర దుకాణాలు 4 గంటలే..   - maharashtra imposes more restrictions on daily essentials
close
Published : 20/04/2021 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో నిత్యావసర దుకాణాలు 4 గంటలే.. 

మరిన్ని ఆంక్షలు విధించిన ఠాక్రే సర్కారు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటికే అక్కడ జనతా కర్ఫ్యూ అమల్లో ఉండగా.. తాజాగా నిత్యావసరాలపై కూడా ఆంక్షలు విధించింది. కిరాణాలు, కూరగాయలు, పండ్లు తదిరత నిత్యావసర దుకాణాలు కేవలం 4 గంటల పాటే తెరవాలని ఆదేశించింది. ఇక రాత్రి 8 తర్వాత హోం డెలివరీని నిలిపివేసింది. ఈ మేరకు ఠాక్రే సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

‘‘కిరాణాలు, కూరగాయల దుకాణాలు, పండ్ల విక్రయాలు, బేకరీలు, అన్ని రకాల ఆహార దుకాణాలు(మాంసం విక్రయాలు కూడా), వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు అమ్మే దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. హోం డెలివరీలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య చేయాలి’’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా ఆంక్షలు నేటి రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. 

రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి ఉన్నప్పటికీ నిత్యావసర సరుకుల పేరుతో చాలా మంది జనం బయటకు వస్తున్నారని, దీంతో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 రాత్రి నుంచి జనతా కర్ఫ్యూ పేరుతో లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కూరగాయలు, కిరాణా దుకాణాలు, ఆహారశాలలు తదితర నిత్యావసరాలకు మినహాయింపు కల్పించింది. తాజాగా వాటిపైనా ఆంక్షలు విధించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని