మహారాష్ట్రలోనూ ఉచిత టీకాలు.. కానీ - maharashtra to provide free vaccination to 18 years and above
close
Published : 29/04/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలోనూ ఉచిత టీకాలు.. కానీ

ముంబయి: కరోనా మహమ్మారి ఉద్దృతితో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత టీకాలు అందించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే బుధవారం వెల్లడించారు. అయితే ఉచిత టీకా పంపిణీ మే 1 నుంచి ప్రారంభించబోమని అన్నారు. రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా మరింత కాలం ఆంక్షలు కొనసాగించాలని ఠాక్రే సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో 18ఏళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్‌ ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

టీకా పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధ్యక్షతన నేడు కేబినెట్‌ సమావేశం జరిగింది. ఇందులోనే ఉచిత టీకాలపై నిర్ణయం తీసుకున్నట్లు రాజేశ్ తోపే తెలిపారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.6,500కోట్ల మేర భారం పడనుందని అన్నారు. ‘‘18 నుంచి 44 ఏళ్ల వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియను మే 1 నుంచి ప్రారంభించడం లేదు. టీకాల కోసం అర్హులైన వారందరూ కొవిన్‌ యాప్‌లో ముందస్తు నమోదు చేసుకోవాలని కోరుతున్నా. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తారు. నేరుగా వ్యాక్సిన్‌ నమోదుకు అనుమతి లేదు. 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ కేంద్రాలను కూడా వేరుగా ఏర్పాటు చేస్తున్నాం.’’ అని తోపే వివరించారు.

అయితే టీకా పంపిణీ ఆలస్యానికి గల కారణాన్ని మంత్రి చెప్పనప్పటికీ ఆంక్షల పొడగింపు నేపథ్యంలోనే దీన్ని వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మే 1 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. అయితే కేసుల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల లేకపోవడంతో మరిన్ని రోజులు నిబంధనలు పొడిగించాలని ఠాక్రే సర్కారు యోచిస్తోంది. మే 15 వరకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని చూస్తోంది.  రాష్ట్రంలో మంగళవారం 66వేల పైన కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 895 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటివరకు 1.53కోట్ల మందికి టీకాలు ఇచ్చారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని