వ్యాక్సినేషన్‌ ఒక విప్లవాత్మక ముందడుగు - maharastra cm speaks on vaccination
close
Updated : 17/01/2021 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సినేషన్‌ ఒక విప్లవాత్మక ముందడుగు

ముంబయి: కరోనా కట్టడిలో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మహారాష్ట్రలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కావడం ఒక విప్లవాత్మక ముందడుగు అని అన్నారు. కరోనాకు ఎలాంటి ఔషధం లేని సమయంలో ‘కరోనా వారియర్స్‌’ నిస్వార్థంగా కొవిడ్‌-19 బాధితులకు చికిత్స అందించారని ప్రశంసించారు. 

‘ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతుంది. కరోనా బాధితులతో ఆస్పత్రులు నిండిపోయాయి. వారికి ఎలా నయం చేయాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. పరిష్కారం లేకపోవడంతో అప్పుడు అందరూ ఎంతో ఒత్తడికి గురయ్యారు. కరోనా వారియర్స్‌ నిరంతర, నిస్వార్థ కృషి కారణంగా ఇప్పుడు ఆస్పత్రుల్లో కరోనా బాధితులు తగ్గిపోయారు. రానున్న రోజుల్లో కొవిడ్‌ సెంటర్లలో బాధితుల సంఖ్య సున్నాకు చేరాలని ఆశిస్తున్నా’’అని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని కోరారు. కొన్ని దేశాల్లో మరోసారి పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని.. ఆ పరిస్థితి మనకు ఎదురుకాకుండా ఉండాలంటే మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సీఎం సూచించారు.

దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌లో భాగంగా మహారాష్ట్రకు కేంద్రం 1.39లక్షల కొవిషీల్డ్‌ టీకాలు పంపిణీ చేసింది. ముంబయిలో ఏర్పాటు చేసిన 40 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ తొలి రోజు 4వేల మంది ఆరోగ్య సిబ్బందికి ఈ టీకా ఇచ్చారు.

ఇవీ చదవండి..

టీకాపై వదంతులు నమ్మొద్దు: కేజ్రీవాల్‌

భారత్‌లో టీకా పంపిణీ.. ప్రపంచానికి పాఠాలు!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని