ఈ అవార్డు తెలుగు సినిమాకు దక్కిన గుర్తింపు - maharshi national award dil raju vamsi paidipally press meet
close
Updated : 22/03/2021 23:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ అవార్డు తెలుగు సినిమాకు దక్కిన గుర్తింపు

దర్శకుడు వంశీ పైడిపల్లి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ అవార్డు తెలుగు సినిమాకు దక్కిన గౌరవం అని డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి అన్నారు. 2019కి సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సోమవారం ప్రకటించింది. అందులో ‘మహర్షి’ చిత్రానికి ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ విభాగాల్లో పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా చిత్రబృందం టపాసులు కాల్చి సంబురాలు చేసుకుంది. అనంతరం దర్శకనిర్మాతలు మీడియాతో మాట్లాడారు.. 

ఈ సందర్భంగా డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు రావడం నాకు ఒక గొప్ప మధుర క్షణం. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. సినిమాలో మాకు పెద్ద బలం మహేశ్‌బాబు. ఆయనకు నేను కథ చెప్పగానే ఎంతో సంతోషించారు. ‘మనం ఒక గొప్ప సినిమా చేయబోతున్నాం’ అని అన్నారు. అలా ఎంతో నమ్మకంతో మా ‘మహర్షి’ ప్రయాణం ప్రారంభించాం. 2019 మే 9న విడుదలైన తర్వాత ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ‘నా కెరీర్‌లో ఎంతో గర్వించదగ్గ సినిమా మహర్షి’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ నాకు ఇంకా గుర్తుంది. ఈ అవార్డు కేవలం మాది మాత్రమే కాదు. తెలుగు సినిమాకు దక్కిన గుర్తింపు ఇది. తెలుగు ప్రేక్షకులతో పాటు సినిమాకు పనిచేసిన వాళ్లందరికీ ఈ అవార్డు అంకితం చేస్తున్నాను. ఎందుకంటే నా ఒక్కడి వల్ల సాధ్యమైంది కాదిది. అందరూ ఎంతో కష్టపడ్డారు. దేవిశ్రీప్రసాద్‌ మంచి సంగీతం అందించారు. అవార్డు గెలుపొందిన రాజు సుందరం మాస్టర్‌కు అభినందనలు’’ అని వంశీ అన్నారు.

అనంతరం దిల్‌ రాజు మాట్లాడారు.. ‘‘మహర్షికి ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక మంచి ఐడియాతో మహేశ్‌బాబును హీరోగా పెట్టుకొని కమర్షియల్‌ సినిమా తీసిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. మరో గొప్ప సినిమా మాకు ఇచ్చినందుకు మహేశ్‌బాబుకు కృతజ్ఞతలు. కరోనా తర్వాత దేశం మొత్తం మీద తెలుగు పరిశ్రమ మాత్రమే మంచి స్థితిలో ఉంది’’ అని ఆయన అన్నారు. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘జెర్సీ’ యూనిట్‌కు అభినందనలు చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని