అడవి బాటలో మహేష్ బాబు - రాజమౌళి? - mahesh babu - rajamouli on the jungle trail
close
Published : 19/02/2021 18:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అడవి బాటలో మహేష్ బాబు - రాజమౌళి?

ఇంటర్నెట్ డెస్క్: తెలుగులో అగ్ర హీరోతో దర్శకధీరుడి సినిమా అంటే ఎన్ని భారీ అంచనాలుంటాయో ఇప్పటికే మనం చూశాం. ప్రస్తుతం రాజమౌళి తన దృష్టంతా ‘ఆర్.ఆర్.ఆర్’పైనే పెట్టారు. ఈ చిత్రం తరువాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నారు. ఎలాంటి కథలో తమ హీరోని చూపిస్తారా? అని సూపర్‌స్టార్‌ అభిమానులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో ఓ టాక్‌ నడుస్తోంది. బాహు భాషా చిత్రంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి కె.విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనే కథ గురించి తండ్రీ కొడుకులు చర్చించుకున్నారట. ఆఫ్రికా అడవుల్లో సాగే, యాక్షన్‌ అడ్వెంచర్ కథాంశంతో కూడిన లైన్‌ను మహేశ్‌కు వినిపించారట. ఆయన కూడా ఓకే చెప్పారని టాక్‌. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని టాక్‌. ‘ఆర్.ఆర్.ఆర్’ అక్టోబర్ 13న విడుదలైన వెంటనే, రాజమౌళి సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్‌ బాబు  ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకుక్కుతున్న సినిమా షూటింగ్ దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని