అవసరమైతేనే బయటకు రండి: మహేశ్‌బాబు - mahesh babu advice to people wear mask
close
Published : 08/05/2021 21:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవసరమైతేనే బయటకు రండి: మహేశ్‌బాబు

హైదరాబాద్‌: ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులతో పాటు, పలువురు ప్రముఖులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కూడా అదే సూచన చేస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని, అది కూడా తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్‌ చేశారు.

‘‘రోజు రోజుకీ కొవిడ్‌-19 తీవ్రమవుతోంది. బయటకు వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడం మర్చిపోవద్దు. అవసరమైతేనే బయటకు వెళ్లండి. ఒకవేళ కరోనా బారినపడితే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో పరిశీలన చేసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీని ద్వారా అవసరమైన వారికి పడకలు అందుతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరింత దృఢంగా తయారవుతామని నేను నమ్ముతున్నా. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’’ -ట్విటర్‌లో మహేశ్‌బాబు

మహేశ్‌బాబుతో బాటు పలువురు సినీ నటులు కూడా కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు సినీ నిర్మాణ సంస్థలు కరోనా బాధితులకు అవసరమైన సమాచారాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ వారి అవసరాలను తీర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని