మహేష్‌బాబు కొత్త చిత్రం పేరు ‘పార్థు’? - mahesh babu new movie title pardhu
close
Updated : 05/05/2021 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేష్‌బాబు కొత్త చిత్రం పేరు ‘పార్థు’?

ఇంటర్నెట్‌ డెస్క్: మహేశ్‌బాబు కథానాయకుడిగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘మహేశ్‌ 28’ వర్కింగ్‌ టైటిల్‌గా సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చిత్రానికి ‘పార్థు’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలో మహేశ్‌ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపించనున్నాడట. ఇందులో ఆయన తండ్రిగా బాలీవుడ్‌ నటుడు అనిల్ కపూర్‌ను తీసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్‌ డాన్‌ పాత్రలో కనిపించనున్నారట.

ఈ చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చనున్నారని సమాచారం. ఇందులో నాయికగా పూజాహెగ్డేను తీసుకోనున్నారని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. గతంలో పూజా ‘మహర్షి’ కోసం మహేశ్‌తో కలిసి నటించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌ ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు చేశాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. సినిమాని వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని