మహేశ్‌ రెండు పాత్రల్లో కనిపించనున్నాడా? - mahesh babu play dual role in sarkaru vaari paata
close
Updated : 04/09/2020 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ రెండు పాత్రల్లో కనిపించనున్నాడా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘సర్కారు వారి పాట’లో మహేశ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాలీవుడ్‌ టాక్‌. వీటిలో ఒకటి పాన్‌ బ్రోకర్‌ కాగా, మరొకటి బ్యాంకు ఆఫీసర్‌గా కనిపిస్తారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే, ఒకరే రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారా? లేక ద్విపాత్రాభినయమా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. దీనిపై చిత్ర బృందం నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.

మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ సినిమాను అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కొంత షెడ్యూల్‌ను ఇక్కడే తెరకెక్కించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని