నాని టీమ్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు - mahesh babu praises nani and satyadev
close
Published : 20/06/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాని టీమ్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేచురల్‌ స్టార్‌ నానిపై టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు పొగడ్తల వర్షం కురిపించారు. కరోనా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అంకితం చేస్తూ నాని తన టీమ్‌తో కలిసి ‘దారే లేదా’ అనే వీడియో సాంగ్‌ను రూపొందించి.. విడుదల చేసిన విషయం తెలిసిందే. దానికి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. 

తాజాగా ప్రముఖ కథానాయకుడు మహేశ్‌బాబు సైతం ట్విటర్‌ వేదికగా ఈ పాటపై స్పందించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అంకితమిస్తూ రూపొందించిన ఈ వీడియో సాంగ్‌ తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. నాని, చాయ్‌ బిస్కట్‌ టీమ్‌ కలిసి చేసిన ఈ కార్యక్రమం ఆదర్శవంతమైందని మహేశ్‌ పేర్కొన్నారు. మహేశ్‌బాబు చేసిన ట్వీట్‌కు నాని బదులిస్తూ.. ‘‘థాంక్యూ సర్‌, మీ స్పందన మా పాటను ఎంతో మంది హృదయాలకు చేరుస్తుంది. ఇంకా ఎక్కువ అడగదలచుకోలేదు’’ అని పేర్కొన్నారు. ఈ పాటలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్‌ సైతం స్పందిస్తూ.. మహేశ్‌కు ధన్యవాదాలు చెప్పాడు.

కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల గొప్పతనం తెలియజేసేలా తెరకెక్కించిన ఈ పాటను ఈ నెల 18న విడుదల చేశారు. విజ‌య్ బుల్గానిన్‌ స్వరాలు స‌మ‌కూర్చిన‌ ఈ పాట‌కు కె.కె. సాహిత్యం అందించారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై నాని సమర్పణలో రూపొందించారు. న‌టులు సత్యదేవ్‌‌, రూప ఈ గీతంలో కనిపించారు. చాయ్‌ బిస్కెట్‌ ఈ పాటను ఎగ్జిక్యూట్‌ చేసింది. తెలుగు, త‌మిళ భాషల్లో రూపొందిందీ గీతం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని