మహేశ్‌బాబు కూడా చెప్పేశారు! - mahesh babu sarkaru vaari paata update
close
Published : 29/01/2021 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌బాబు కూడా చెప్పేశారు!

హైదరాబాద్‌: అగ్ర కథానాయకులందరూ తమ సినిమాల విడుదల తేదీని ప్రకటిస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మహేశ్‌బాబు కూడా వచ్చి చేరారు. ఆయన కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైన చిత్రీకరణ ఇటీవల దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తాళాల గుత్తి పట్టుకున్న మహేశ్‌ చేతి పోస్టర్‌ను విడుదల చేశారు.

‘‘సూపర్‌స్టార్‌’ సంక్రాంతి మరోసారి రానుంది. ‘సర్కారువారి పాట’ను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం- ట్విటర్‌లో చిత్ర బృందం

మైత్రీమూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. గతేడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మహేశ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మరోసారి సంక్రాంతి బరిలోకి మహేశ్‌ దిగుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి...

సమయం లేదు మిత్రమా..! RRR: తారక్‌ ప్రేయసి జెన్నీఫర్‌ ఆగయా

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని