14 ఏళ్లకు బయటకొచ్చిన మహేష్‌ ఫొటో - mahesh unseen pic from athidi
close
Published : 10/02/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

14 ఏళ్లకు బయటకొచ్చిన మహేష్‌ ఫొటో

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: 14 ఏళ్ల నాటి మహేష్‌ బాబు ఫొటో ఇప్పుడు బయటకు రావడమేంటి అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మహేష్‌ ‘అతిథి’ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అమృతరావు నాయిక. 2007లో విడుదలైందా సినిమా. ఆ చిత్రంలో ‘ఖబడ్దారని’ అంటూ సాగే ఓ గీతముంది. ఆ పాట చిత్రీకరణ సమయంలో తీసిన ఫొటో అది. ఇన్నేళ్లకు దాన్ని బయటపెట్టింది మహేష్‌ బృందం. మహేష్‌ ఇందులో బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ దుస్తులు ధరించి పొడవాటి జుత్తుతో స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. దీన్ని చూసిన మహేష్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు మహేష్‌. కీర్తి సురేష్‌ నాయిక. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దుబాయ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మహేష్  ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని గెటప్‌లో దర్శనమివ్వనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 సంక్రాంతికి సందడి చేయనుంది.

ఇదీ చదవండి..

‘ఏబీసీడీ 3’ సిద్ధం అవుతోంది! రెమో డిసౌజా

 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని