సైబరాబాద్‌ పోలీసులకు మహేశ్‌బాబు చేయూత - maheshbabu gives his support to cyberabad police on plamsa donation
close
Updated : 24/04/2021 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సైబరాబాద్‌ పోలీసులకు మహేశ్‌బాబు చేయూత

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా విజృంభిస్తున్న వేళ టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు తన అభిమానులకు ఒక పిలుపునిచ్చారు. అర్హులంతా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం తన కుటుంబంతో పాటు మహేశ్‌ స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. కాగా.. కరోనా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహేశ్‌బాబు గతకొంతకాలంగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. తాజాగా.. ప్లాస్మా దానం చేయాలంటూ.. సైబరాబాద్‌ పోలీసులు పోస్టు చేసిన వీడియోపై మహేశ్‌ స్పందించారు. ‘‘కరోనాతో పోరాడుతున్న వారికోసం మనకు సాధ్యమైనంత చేయూతనిద్దాం. గతంలో కంటే ఇప్పుడు ప్లాస్మా దాతలు మరింత అవసరం. పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ గారు, సైబరాబాద్‌ పోలీసులు తీసుకున్న చొరవకు నా మద్దతు తెలియజేస్తున్నాను’’ అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత మహేశ్‌బాబు ఫొటోతో తయారు చేసిన ఒక వీడియోను తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖ ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘జీవితం అనేది ఒక యుద్ధం.. దేవుడు మనల్ని వార్‌ జోన్‌లో పడేశాడు. బీ అలర్ట్‌. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మాస్కు తప్పనసరిగా వాడండి’ అంటూ అందులో పేర్కొంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని