మణిరత్నం దర్శకత్వంలో మహేశ్‌ చిత్రం..! - maheshbabu to team up with mani ratnam
close
Updated : 12/07/2021 04:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మణిరత్నం దర్శకత్వంలో మహేశ్‌ చిత్రం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో ఒక వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, లెజండరీ డైరెక్టర్‌ మణిరత్నం కలిసి ఓ సినిమా చేయబోతున్నారట.! మొదట్లో పుకారుగా అనిపించినా.. చివరికి నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. మహేశ్‌బాబుతో కలిసి పనిచేయాలని ఏ డైరెక్టర్‌ అయినా కోరుకుంటారు. మరోవైపు మణిరత్నంలో ఒక్కసినిమా అయినా చేయాలని ఎంతో మంది హీరోలు తహతహలాడుతుంటారు. మరి అలాంటిది ఈ ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం వస్తే ఎందుకు కాదంటారు చెప్పండి. పైగా.. మహేశ్‌బాబుతో కలిసి పనిచేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని గతంలో పలుమార్లు మణిరత్నం చెప్పుకొచ్చారు కూడా. వెరసి త్వరలోనే మహేశ్‌బాబు, మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా విషయం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే మణిరత్నం ఒక కథ కూడా మహేశ్‌కు వినిపించారు. ఈ విషయాన్ని స్వయంగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే సినిమాకు మహేశ్‌బాబు పచ్చ జెండా ఊపారా..? లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే.. త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నానని మణిరత్నం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో బిజీగా ఉన్న మహేశ్‌బాబు ఆ తర్వాత రాజమౌళితో చేయనున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ కలయిక కుదిరితే మహేశ్‌బాబు-రాజమౌళి సినిమా తర్వాత పట్టాలెక్కేది మహేశ్‌బాబు-మణిరత్నం చిత్రమే అనడంలో సందేహం లేదు. 

మహేశ్‌బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’లో నటిస్తున్నారు. మొదటి షెడ్యుల్‌ పూర్తి చేసుకున్న అనంతరం కరోనా సెకండ్‌వేవ్‌ మొదలైంది. దీంతో చిత్రీకరణ నిలిచిపోయింది. మళ్లీ రెండో షెడ్యుల్‌ ఇటీవల మొదలైంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా సందడి చేయనుంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని