మహేష్‌ - రాజమౌళిల సినిమా అప్పుడేనా? - maheshrajamouli film starting in october
close
Updated : 20/04/2021 14:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేష్‌ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?

ఇంటర్నెట్‌ డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి - మహేష్‌బాబుతో కలిసి ఓ సినిమా చేయనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఛత్రపతి శివాజీ జీవితాధారంగా చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాని అక్టోబర్‌ నెలలోనే ప్రారంభించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. మొత్తం మీద వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా.. అని ఎదురుచూసే అభిమానులకు ఇదొక  శుభవార్తే అని చెప్పవచ్చు.

గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలోనే మహేష్‌బాబుతో సినిమా చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి నిర్మాత కె.ఎల్.నారాయణ. ప్రస్తుతం మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో బ్యాంకింగ్‌ రంగంలోని కుంభకోణాలతో ఈ చిత్ర కథ తెరకెక్కుతోంది. కీర్తి సురేష్‌ కథానాయిక.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని