న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కంబాలపల్లి కథలు - mail got a call for the new york indian film festival 2021
close
Published : 08/05/2021 17:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కంబాలపల్లి కథలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు ప్రియదర్శి నటించిన ‘కంబాలపల్లి కథలు’ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రియాంకదత్‌ నిర్మించారు. ఈ వెబ్‌సిరీస్‌లో ఛాప్టర్‌1గా వచ్చిన ‘మెయిల్’ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా.. ఇప్పుడు అది ఏకంగా న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021కు ఎంపికైంది. జూన్‌ 4న న్యూయార్క్‌ వేదికగా ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వప్న సినిమా ట్విటర్‌లో పంచుకుంది. ‘‘ఈ క్లిష్ట సమయంలో ప్రపంచానికి ఒక సంతోషకరమైన ‘మెయిల్’ పంపిస్తున్నాం. జూన్ 4న న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా చిత్రాన్ని చూడండి’’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలని కలలు కనే గ్రామీణప్రాంతానికి చెందిన ఒక యువకుడి కథతో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా.. విడుదలైన ఈ సిరీస్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చాలామందికి తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో అందుబాటులో ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని