ఆ తేడాను గమనించాలి: అమైరా - mainting the balance of acting and overacting challenging says amyra
close
Published : 27/03/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ తేడాను గమనించాలి: అమైరా

ఇంటర్నెట్‌ డెస్క్: కునాల్‌ కపూర్‌ హీరోగా అమైరా దస్తర్‌ కలిసి జంటగా నటిస్తోన్న బాలీవుడ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కోయి జానే నా’. అమిన్‌ హజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని టీ-సీరీస్‌, అమిన్‌ హజీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ కలిసి సంయక్తంగా నిర్మించాయి. ఏప్రిల్ 2 తెరపైకి రానున్న ఈ చిత్రం గురించి నటి అమైరా దస్తర్‌ మాట్లాడారు

‘‘నాకు మొదటగా సినిమా కథనం నచ్చింది. నా పాత్ర ఒక హంతకురాలు అని అమిన్‌ చెప్పినప్పుడు షాక్‌ తిన్నా. సినిమా స్ర్కీన్‌ప్లే చాలా బాగుంటుంది. మిమ్మల్ని థ్రిల్లింగ్‌కి గురిచేస్తుంది. ఆమీర్‌ఖాన్‌ ఇటీవల సినిమా ప్రత్యేక షో చూశారు. ఆయన సినిమా చూశాక చాలా బాగుందని కితాబిచ్చారు. దాంతో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నాం. ఇందులో నా పాత్ర పేరు సుహానా. చాలా సాహసోపేతమైన అమ్మాయి. ఇలాంటి థ్రిల్లర్ చిత్రంలో నటనకు, ఓవర్‌యాక్టింగ్‌ మధ్య ఉన్న సన్నని తేడాను గమనించాలి. ఆ తేడాను గమనిస్తూ నటించడం అంటే ఓ విధంగా సవాల్‌లాంటిదే. ప్రేక్షకులకు మన నటన అతిగా అనిపించకూడదు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో పెద్దతెర గొప్పదా లేక ఓటీటీ వేదిక బాగుంటుందా అంటే చెప్పలేం?. ఓటీటీలో మంచి కంటెంట్‌ వస్తోంది. కానీ పెద్ద తెరపై సినిమా చూస్తుంటే ఆ అనుభూతే వేరు. దాన్ని వేరే ఏ ఇతర తెర అయినా భర్తీ  చేస్తుందని అనుకోనుకోలేమని’’ తెలిపింది.

‘కోయి నా జానే నా’ చిత్రంలో ఆమీర్‌ఖాన్‌, ఎల్లీ అవ్రమ్‌ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. అమైరా దస్తర్‌ తెలుగులో మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో సందీప్‌ కిషన్‌ సరసన నటించింది. ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన ‘రాజుగాడు’లో కథానాయికగా అలరించింది. ప్రస్తుతం తమిళంలో ప్రభుదేవా సరసన 'బఘీరా'లో నటిస్తోంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని