Bollywood: స్కైపాల్‌ యాక్షన్‌ దర్శకుడితో... - major action sequence of tiger shroff heropanti 2 to be shot in russia
close
Published : 09/06/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: స్కైపాల్‌ యాక్షన్‌ దర్శకుడితో...

ముంబయి: బాలీవుడ్‌లో యాక్షన్‌ చిత్రాలంటే గుర్తొచ్చే యువ హీరోల్లో టైగర్‌ ష్రాఫ్‌ది ముందు వరసే. ఆయన కథానాయకుడిగా అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వంలో ‘హీరోపంటి 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మార్చిలో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ను రష్యాలో చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ‘‘కీలకమైన యాక్షన్‌ ఘట్టాలతో పాటు ఓ పాటను మాస్కో, సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ల్లో చిత్రీకరించనున్నారు. భారీ పోరాట సన్నివేశాల కోసం అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ డైరెక్టర్స్‌ను సంప్రదిస్తున్నారు. ‘స్కైపాల్‌’, ‘ది బోర్నే అల్టిమేటమ్‌’, ‘ది బోర్నే సుప్రిమసీ’ తదితర చిత్రాలకు పనిచేసిన స్టంట్‌ డైరెక్టర్‌ మార్టిన్‌ ఇవానో ఈ చిత్రానికి పనిచేయనున్నారు’’అని చిత్ర వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. రష్యా వెళ్లేలోపు చిత్రబృందం మొత్తానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్మాత సాజిద్‌ నడియాడ్‌ భావిస్తున్నారట. తారా సుతారియా, నవాజుద్దీన్‌ సిద్దిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని