close
Published : 12/04/2021 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అడివి శేష్‌ ‘మేజర్‌’ టీజర్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: థ్రిల్లర్‌ సినిమాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న అడివి శేష్‌ మరోసారి సరికొత్త పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ‘మేజర్‌’గా మారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్‌ శశికిరణ్‌ తెరకెక్కించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జులై 2న విడుదల కానుంది.

‘‘మన బోర్డర్‌లో ఆర్మీ ఎలా ఫైట్‌ చేయాలి? ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా గెలవాలి? అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని’’ అంటూ శేష్‌ చెబుతున్న డైలాగ్స్‌ ఉద్విగ్నంగా ఉన్నాయి.

సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి, మురళీశర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు.  తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌లు ఈ టీజర్‌ను విడుదల చేశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని