Adivi Sesh: మాటిస్తున్నా.. మామూలుగా ఉండదు - major release postponed due to pandamic
close
Published : 26/05/2021 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Adivi Sesh: మాటిస్తున్నా.. మామూలుగా ఉండదు

‘మేజర్‌’ ట్వీట్‌ చూశారా

హైదరాబాద్‌: ‘మాటిస్తున్నా.. ‘మేజర్‌’ మామూలుగా ఉండదు’ అని అంటున్నారు నటుడు అడివిశేష్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మేజర్‌’. ముంబయి ఉగ్రదాడిలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం మొదట భావించింది. ఈ మేరకు అప్పట్లో ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

కాగా, తాజాగా కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ‘మేజర్‌’ రిలీజ్‌ వాయిదా వేస్తున్నట్లు అడివి శేష్‌ ప్రకటించారు. పరిస్థితులన్ని చక్కబడిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతిఒక్కరూ సురక్షితంగా ఇంటిపట్టునే ఉండాలని ఆయన సూచించారు. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శోభితా దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్‌ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని