Mammootty: పోలీసుల్ని క్యాంపస్‌లోకి రానివ్వం - mammootty starer great shankar teaser out now
close
Published : 03/07/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mammootty: పోలీసుల్ని క్యాంపస్‌లోకి రానివ్వం

తిరువనంతపురం: ‘పోలీసులు, అంబులెన్సులను క్యాంపస్‌లోకి రానివ్వం’ అని అంటున్నారు మలయాళీ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మాస్టర్‌ పీస్‌’. అజయ్‌ వాసుదేవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘గ్రేట్‌ శంకర్‌’ పేరుతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శనివారం ఉదయం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో మమ్ముట్టి కళాశాలలో అధ్యాపకుడిగా యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. అలాగే నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పోలీస్‌ అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్ర పోషించారు. ఉన్ని ముకుందన్‌, పూనమ్‌ బజ్వా ఈసినిమాలో నటించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని