Viral Video: స్వీట్లు కొనడానికేనట! - man goes out with going to buy sweets sign around neck during bengal lockdown.
close
Published : 17/05/2021 20:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viral Video: స్వీట్లు కొనడానికేనట!

కలకత్తా: బెంగాల్‌ ప్రజలు తమ ఆహారాన్ని చాలా ఇష్టపడతారు. స్వీట్లంటే వాళ్లకు ప్రాణం. అందుకు నిదర్శనమే ఈ వీడియో. ఈ లాక్‌డౌన్‌లో అక్కడి ప్రభుత్వం ఉదయం 10గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకూ స్వీట్ల దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. దాంతో ఒక వ్యక్తి స్వీట్లు కొనడానికి బయటకు వచ్చాడు. ‘స్వీట్లు కొనడానికి వెళ్తున్నా’ అని రాసి ఉన్న బోర్డును మెడకి తగిలించుకుని మరీ రోడ్డు మీద తిరుగుతున్నాడు. రోడ్డుమీద గస్తీ కాస్తున్న పోలీసులు అతణ్ని ఆపి విచారించగా.. మెడలో బోర్డును చూపిస్తూ ‘స్వీట్లు కొనడానికి వెళ్తున్నా’ అని అక్కడి నుంచి ఉడాయించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని