మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు - manchu vishnu on mahesh babu
close
Updated : 16/01/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా..? కేవలం అభిమానులే కాదు.. తన సహనటులతో పాటు దక్షిణాది.. ఉత్తరాది సినీ ప్రముఖులు కూడా మహేశ్‌బాబు అందానికి ఫిదా అయినవాళ్లే. మంచితనాన్ని కొనియాడినవాళ్లే. తాజాగా మహేశ్‌బాబుపై హీరో మంచు విష్ణు ప్రశంసలు కురిపించాడు. విష్ణు సతీమణి వెరొనికా జన్మదిన వేడుకల్లో మహేశ్‌ తన సతీమణి నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు విష్ణు.

‘‘ఈ ఫొటోలో ఉన్న ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ యువకుడిలా మారుతూ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ఆయన మంచితనమే దానికి ప్రధాన కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అని విష్ణు ఆ పోస్టులో పేర్కొన్నాడు.  దీనిపై సూపర్‌స్టార్‌ స్పందించాడు. ‘ఇంతమంచి ఆతిధ్యమిచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ వేడుకల్లో మరో హీరో గోపీచంద్‌ కూడా హాజరయ్యాడు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’లో నటిస్తున్నాడు. ఆ సినిమా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మరోవైపు గోపీచంద్‌ ‘సీటీమార్‌’ అంటూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. సంపత్‌నంది డైరెక్టర్‌. మంచు విష్ణు నటిస్తున్న ‘మోసగాళ్లు’ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి..

ట్రెండింగ్‌లో దూసుకెళ్తోన్న పవర్‌ప్యాక్డ్‌ టీజర్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని