ఓటు వేయడమే నిజమైన దేశభక్తి: మంచు విష్ణు - manchu vishnu on vote casting
close
Published : 08/04/2021 19:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటు వేయడమే నిజమైన దేశభక్తి: మంచు విష్ణు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నవాళ్లే అసలైన దేశభక్తులని ప్రముఖ నటుడు మంచు విష్ణు ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా తన ఓటు వేశాక, మాట్లాడుతూ తెలిపారు. ‘దేశ సరిహద్దుల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు.. నేను ఇండియన్‌ను.. దేశం కోసం ఏదైనా చేస్తానని అంటుంటారు. కానీ, ఓటు దగ్గరకు వచ్చేసరికి సీరియస్‌గా ఉండరు. అసలైన దేశభక్తి ఉన్నవాళ్లు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ముఖ్యంగా యువత తమ ఓటు హక్కు విషయంలో బద్దకం ప్రదర్శించడం సరికాదు. ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు ఉండదు. ఇక ఓటు కోసం డబ్బు తీసుకునేవాళ్లు తమ సమస్యలపై ప్రజాప్రతినిధులను నిలదీసే హక్కు కోల్పోతారు. వారు తమ ఆత్మాభిమానాన్ని అమ్ముకున్నట్లే. ఓటు వేయకపోతే ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం కోల్పోయినట్లే. ఓటు వేయని వాళ్లకు ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలన్న సీపీ సజ్జనార్‌ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తాను’ అని ఆయన అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని