అందుకు మణిరత్నమే ప్రేరణ: రెహమాన్‌ - mani ratnam inspired ar rahman to turn film writer producer
close
Published : 04/04/2021 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకు మణిరత్నమే ప్రేరణ: రెహమాన్‌

ముంబయి: ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ నిర్మాత-కథకుడిగా పనిచేస్తున్న చిత్రం ‘99 సాంగ్స్’. ఏప్రిల్‌ 16న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను సినీ నిర్మాతగా మారడానికి కారణం మణిరత్నం. ఓసారి ఆయన నాతో  ‘మీకు సినిమా ఎలా చేయాలో తెలుసు. పాట ఎలా పాడుతారో తెలుసు, దాన్ని ట్యూన్‌ చేసి నేపథ్య సంగీతం అందిస్తారు. చివరికి అందంగా బయటకు వస్తోంది’’ కదా అని ప్రోత్సహించారు.

కథలపై నాకున్న ప్రేమే నన్ను ఇటువైపు నెట్టేసింది. మొత్తం ఈ పక్రియ అంతా ఒక కథలాంటింది. కథ రాయడం అంటే మరొక కళ గురించి మన సొంత భాషలో మాట్లాడటం. అది ఎంతో బాగుంటుంది.  నాకు స్ఫూర్తినిచ్చింది. కథలను ఇష్టపడతాను, ప్రేమిస్తాను. ప్రజల జీవితాలను అధ్యయనం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. లోకంలో మన భారతీయ సంస్కృతికి చెందిన వారు మాత్రమే కాదు, ఇతర సంస్కృతుల ప్రజలు కూడా ఉన్నారు’’ అని తెలిపారు.

విశ్వేశ్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ‘99 సాంగ్స్’ చిత్రంలో ఈహాన్‌ భట్‌, ఎడిల్సీ వర్గీస్‌ నాయకానాయికలుగా నటిస్తున్నారు. చిత్రాన్ని జియో స్టూడియోస్‌ సమర్పణలో ఐడియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వైయమ్‌ మూవీస్‌ కలిసి నిర్మిస్తున్నాయి. రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని