Prabhas: ఫ్యామిలీమేన్‌తో ప్రభాస్‌ ఫైట్‌! - manoj bajpayee as antagonist to prabhas salaar movie
close
Published : 20/08/2021 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prabhas: ఫ్యామిలీమేన్‌తో ప్రభాస్‌ ఫైట్‌!

హైదరాబాద్‌: కథానాయకుడికి తగిన జోడీ ఎంత ముఖ్యమో... సై అంటే సై అంటూ ఢీ కొట్టే ప్రతినాయకుడూ అంతే కీలకం. సినిమాలో హీరోయిజం పండాలంటే, హీరోకి ప్రత్యర్థిగా కనిపించే విలన్‌ దీటుగా ఉండాల్సిందే. రాజమౌళి సహా కొద్దిమంది దర్శకులు విలన్‌ పాత్రలపై ప్రత్యేకమైన ప్రేమని కనబరుస్తుంటారు. హీరోని మించి ఆ పాత్రల్ని తీర్చిదిద్దుతుంటారు. ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్‌ కథానాయిక. ప్రభాస్‌ డాన్‌గా కనిపిస్తారని సమాచారం. ఇందులో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా ‘ఫ్యామిలీమేన్‌’ ఫేమ్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ని ఎంపిక చేశారని సమాచారం. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ని చిత్రీకరించారు. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మనోజ్‌ బాజ్‌పాయ్ గతంలోనూ పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని