ముక్కుపై మాస్కు జారిందని.. చితకబాదారు! - mask slipped from nose man beaten mercilessly by cops in madhya pradesh
close
Updated : 07/04/2021 11:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముక్కుపై మాస్కు జారిందని.. చితకబాదారు!

భోపాల్‌: కరోనా వైరస్‌ జాగ్రత్తల విషయమై మధ్యప్రదేశ్‌ పోలీసులు ఓ వ్యక్తి పట్ల  వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఓ ఆటోడ్రైవర్‌ ముక్కు భాగాన్ని కవర్‌ చేసేలా మాస్కు ధరించనందుకు పోలీసులు అతడిని కుమారుడి ముందే విచక్షణా రహితంగా చితకబాదారు. ఈ ఘటన ఇండోర్‌లో చోటుచేసుకుంది.

మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ కేయర్‌ అనే వ్యక్తి స్థానిక ఆటో డ్రైవర్. ఇటీవల ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి వద్దకు కుమారుడితో కలిసి ఆటోలో బయలుదేరాడు. ఈ క్రమంలో అతడు ధరించిన మాస్కు ముక్కు భాగాన్ని కవర్‌ చేయలేదని పేర్కొంటూ పోలీసులు ఆయన్ను ఆపారు. కొంతసేపు వాగ్వాదం జరిగిన అనంతరం ఆటోడ్రైవర్‌ను స్టేషన్‌కు రావాలని సూచించారు. ఇందుకు డ్రైవర్‌ నిరాకరించడంతో అతడిని అక్కడే ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఫోన్‌లో చిత్రీకరిస్తున్నారే తప్ప ఎవరూ పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాడికి పాల్పడిన పోలీసులను కమల్‌ ప్రజాపత్‌, ధర్మేంద్ర జాట్‌లుగా గుర్తించారు. కాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో అధికారులు వారిపై చర్యలకు ఉపక్రమించారు. వారిని సస్పెండ్‌ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని