రిలీజ్‌కు ముందే ‘మాస్టర్‌’ రికార్డుల మోత - master movie teaser has reached 40 million views in youtube
close
Updated : 28/11/2020 07:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలీజ్‌కు ముందే ‘మాస్టర్‌’ రికార్డుల మోత

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇళయ దళపతి విజయ్ హీరోగా వస్తున్న ‘మాస్టర్’ చిత్రం విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ యూట్యూబ్‌లో ఇప్పటికే 4కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ స్వయంగా ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. దీపావళి కానుకగా ఈ సినిమా టీజర్‌ను నవంబర్‌ 14న విడుదల చేశారు. కాగా.. అత్యధిక లైకులు అందుకొని ఇటీవలే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్‌ సరసన మాళవికా మోహన్‌ కనిపించనున్నారు. విజయ్‌ సేతుపతి మరోసారి విలన్‌గా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అనిరుధ్‌ రవిచందర్‌ బాణీలు సమకూర్చారు. కళాశాలలో జరిగే రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. విజిల్‌ సినిమాతో హిట్‌ కొట్టిన విజయ్‌, ఖైదీ సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న లోకేశ్‌, మరోవైపు విలన్‌గా విజయ్‌ సేతుపతి.. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని