ముంబయి: అలా చేస్తే రాత్రి కర్ఫ్యూ అవసరం లేదు.. - mayor says imposing night curfew is necessary
close
Published : 18/03/2021 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబయి: అలా చేస్తే రాత్రి కర్ఫ్యూ అవసరం లేదు..

ముంబయి: దేశంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి నగరవాసులు కలిసి కట్టుగా కృషి చేయాలని ముంబయి మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతానికి రాత్రి కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదు. రద్దీగా ఉన్న మార్కెట్లను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నాం. కరోనా జాగ్రత్తలు పాటించి లాక్‌డౌన్‌ అవసరం లేకుండా చేసే బాధ్యత ముంబయివాసులపై ఉంది. వార్డు స్థాయిలో వాలంటీర్లు కొవిడ్‌-19 పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు’ అని ఆమె వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని