Kohli Fan: ముఝే విరాట్‌ దేదో ప్లీజ్‌! - meet virat kohli fan girl rizla rehana
close
Updated : 04/06/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kohli Fan: ముఝే విరాట్‌ దేదో ప్లీజ్‌!

పాక్‌ అభిమాని రిజ్లా రెహాన్‌ అందాల చిత్రాలు

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటప్పుడు పాకిస్థాన్‌లో మాత్రం ఉండరా ఏం? దాయాది దేశంలో విరాట్‌ ఆటకు ఫిదా అయినవాళ్లు చాలామందే ఉన్నారు. కొందరైతే అతడిపై ఇష్టంతో ఇంటిపై త్రివర్ణ పతాకమే ఎగరేశారు! మరికొందరు ప్లకార్డులు పట్టుకొని, టీమ్‌ఇండియా జెర్సీలు ధరించి మ్యాచులకు వస్తుంటారు. ఆ కోవకే చెందుతుంది రిజ్లా రెహాన్‌.

రిజ్లా పాకిస్థాన్‌కు చెందిన అమ్మాయి. ఇంగ్లాండ్‌లో నివసిస్తుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘ముఝే విరాట్‌ దేదో, ప్లీజ్‌ ముఝే విరాట్‌ దేదో’ అని ఏడుస్తూ సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయింది. క్రికెట్‌ను ఆమె అమితంగా ఇష్టపడుతుంది. అందులోనూ భారత్‌, పాక్‌ తలపడే మ్యాచులంటే ఇక చెప్పేదేముంది. 2018 ఆసియాకప్‌ సమయంలోనే ఆమె మీడియా కంట పడింది. 2019 ప్రపంచకప్‌లో ఆమె టీమ్‌ఇండియాకు మద్దతునివ్వడం అందరినీ ఆశ్చర్య పరిచింది. పాక్‌ సెమీస్‌కు చేరుకుంటుందేమోనని టికెట్లు కొనుగోలు చేశానని ఆమె అప్పుడు చెప్పడం గమనార్హం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌














మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని