అల్లు అరవింద్‌కు కరోనా: స్పందించిన నిర్మాత - mega producer allu aravind clarifies about covid positive reports
close
Updated : 05/04/2021 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లు అరవింద్‌కు కరోనా: స్పందించిన నిర్మాత

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండుసార్లు వ్యాక్సిన్‌ వేయించుకున్నా తనకు కరోనా వచ్చిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. తనకు కరోనా వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. తనకు కరోనా వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే అసలు జరిగింది వేరని వివరించారు.

‘‘అందరికీ నమస్కారం.. నాకు కరోనా వచ్చిందంటూ వస్తున్న వార్తలపై స్పందించటం కోసమే మీ ముందుకు వచ్చాను. నాకు కరోనా వచ్చిన మాట నిజం. అయితే, రెండు వ్యాక్సిన్‌ డోస్‌ల తర్వాత కూడా నాకు కరోనా వచ్చినట్లు కొందరు రాస్తున్నారు. కానీ, అసలు జరిగింది ఏంటంటే.. నేను ఒక వ్యాక్సిన్‌ డోస్‌ తీసుకున్నా. తర్వాత మేం ముగ్గురం స్నేహితులు కలిసి ఊరెళ్లి వచ్చాం. ఆ తర్వాత మాకు కరోనా వచ్చిందని తెలుసుకున్నాం. నేను, మరొక వ్యక్తి మూడు రోజుల పాటు జ్వరంతో బాధపడ్డాం. మేమిద్దరం వ్యాక్సిన్‌ చేయించుకున్నాం. ఇంకొక వ్యక్తి ఆస్పత్రిలో చేరారు. ఈయన వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై కరోనా ప్రభావం అంతగా ఉండదు. అందుకు మేమే నిదర్శనం. వ్యాక్సిన్‌ తీసుకున్నా కరోనా రావొచ్చు. కొంచెం ఆలస్యం కావొచ్చు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించుకోండి. దీని వల్ల ప్రాణహాని జరగకుండా చూసుకోవచ్చు’’ అని అల్లు అరవింద్‌ తెలిపారు.

మరోవైపు కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కొవిడ్‌-19 టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని