Chiranjeevi: మాస్క్‌ పెట్టుకో.. వ్యాక్సిన్‌ తీసుకో.. - megastar chiranjeevi about covid precautions
close
Published : 14/05/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: మాస్క్‌ పెట్టుకో.. వ్యాక్సిన్‌ తీసుకో..

హైదరాబాద్‌: కరోనా రెండో దశ చాలా తీవ్రంగా ఉందని, ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని అగ్ర కథానాయకుడు చిరంజీవి కోరారు. అవసరమై బయటకు వస్తే, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు.

‘‘కరోనా రెండో దశ చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది కరోనా బారినపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతోంది. మన ఆత్మీయుల్లో కొందర్ని ఈ వైరస్ వల్ల కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంటి నుంచి బయటకు రాకండి. ఒక వేళ రావాల్సి వస్తే, తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి. అవసరమైతే డబుల్‌ మాస్క్‌ ధరించండి. లాక్‌డౌన్‌లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యా్క్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు టీకా వేయించుకోండి. వ్యాక్సినేషన్ తీసుకున్నా కరోనా వచ్చినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది’’

‘‘కరోనా బారినపడితే భయపడవద్దు. వైరస్ కంటే మన భయమే ముందు మనల్ని చంపేస్తుంది. పాజిటివ్‌ అని తెలియగానే మిమ్మల్ని మీరు ఐసోలేట్‌ చేసుకుని ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి. నిరంతరం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ మందులు వాడండి. ఊపిరి తీసుకోవడంలో ఏమాత్రం సమస్య అనిపించినా, ఇబ్బంది కలిగినా వైద్యులను సంప్రదించి ఆస్పత్రిలో చేరండి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నెల రోజుల్లో యాంటీ బాడీస్‌ ఉత్పత్తి అవుతాయి. ప్లాస్మా దానం చేస్తే కరోనా నుంచి ఇద్దరిని కాపాడవచ్చు. ఈ విపత్తు సమయంలో ఈ విషయాలు వీలైనంత మందికి సాయం చేయండి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని, మన ఊరిని మన దేశాన్ని రక్షించుకుందాం. సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు’’  అని చిరంజీవి పేర్కొన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని