Chiranjeevi: స‌తీస‌మేతంగా ర‌క్తదానం చేసిన చిరు - megastar chiranjeevi and his wife surekha donate blood on world blood donor day
close
Published : 14/06/2021 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: స‌తీస‌మేతంగా ర‌క్తదానం చేసిన చిరు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్ర‌పంచ రక్త‌దాత‌ల దినోత్స‌వం (వ‌రల్డ్ బ్ల‌డ్ డోనార్ డే) సంద‌ర్భంగా సోమ‌వారం ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి, ఆయ‌న‌ స‌తీమ‌ణి సురేఖ ర‌క్త‌దానం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా పంచుకుంటూ ర‌క్త‌దాత‌ల్ని అభినందించారు. ‘‘ప్ర‌పంచ ర‌క్త‌దాత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతోన్న నా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌, సిస్ట‌ర్స్‌ని అభినందిస్తున్నాను. చిన్న ప‌నితో ఇత‌రుల ప్రాణాల్ని ర‌క్షించ‌గ‌లుగుతుండటం, వాళ్ల‌తో ర‌క్త సంబంధాన్ని ఏర్ప‌ర‌చుకోవ‌డం గొప్ప అదృష్టం’’ అని అన్నారు. ఒక‌ప్పుడు స‌మ‌యానికి ర‌క్తం అంద‌క‌పోవ‌డంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని చూసి చ‌లించిన చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌ని నెల‌కొల్పిన విషయం తెలిసిందే. ‘ర‌క్తదానం చేయండి.. ప్రాణ‌దాత‌లు కండి’ అని పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేసిన చిరు.. కొవిడ్ సెకండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ బ్యాంక్ ద్వారా ఎంద‌రికో ప్రాణ వాయువును అందిస్తున్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని