నా పెళ్లి వార్త నిజమే: మెహరీన్‌ - mehreen kaur pirzada confirms her engagement next month
close
Published : 14/02/2021 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా పెళ్లి వార్త నిజమే: మెహరీన్‌

నేనెంతో సంతోషంగా ఉన్నా

హైదరాబాద్‌: తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలు నిజమేనని నటి మెహరీన్‌ తెలిపారు. త్వరలోనే తాను వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నానన్నారు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పెళ్లిపై మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.

తాజాగా ఆ వార్తలపై నటి స్పందించారు. తన పెళ్లి వార్తలు నిజమేనని.. వచ్చే నెలలో నిశ్చితార్థం జరగనుందని.. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె వివరించారు. ఈ మేరకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఈ ముద్దుగుమ్మ వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని జైపుర్‌ అలీలా కోటలో మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. మరోవైపు ‘ఎఫ్‌2’కు కొనసాగింపుగా అనిల్‌రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘ఎఫ్‌3’లో ఆమె నటిస్తోంది.

ఇదీ చదవండి

సినిమాల్లో ‘ప్రేమ’కు నిర్వచనాలుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని