మంచి రోజులు వచ్చాయ్‌... - mehreen new movie first look out now
close
Published : 21/07/2021 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంచి రోజులు వచ్చాయ్‌...

హైదరాబాద్‌: ఈ లాక్‌డౌన్‌తో వచ్చిన విరామంలోనే మరో కొత్త సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లారు మారుతి. ఆయన  దర్శకత్వంలో  సంతోష్‌శోభన్, మెహ్రీన్‌ కౌర్‌ పిర్జాదా జంటగా రూపొందుతున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. వి.సెల్యూలాయిడ్‌తో కలిసి ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ‘‘మంచి కలయికలో... నిజ జీవితంలోని పాత్రల స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది. ‘ఏక్‌ మినీ కథ’తో విజయాన్ని అందుకున్న సంతోష్‌ శోభన్, యూవీ కాన్సెప్ట్స్‌ మరోసారి ఈ సినిమాలో భాగం అయ్యారు. ‘మహాను   భావుడు’ తర్వాత మారుతి దర్శకత్వంలో మెహ్రీన్‌ మరోసారి నటించారు. లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని