ఘనంగా మెహరీన్‌ నిశ్చితార్థం - mehreen pirzadaa gets engaged to bhavya bishnoi
close
Published : 12/03/2021 18:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘనంగా మెహరీన్‌ నిశ్చితార్థం

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మెహరీన్‌. తాజాగా ఈ అందాల భామ నిశ్చితార్థం ఆమె ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో ఘనంగా జరిగింది. జైపూర్‌లోని ఓ కోట వీరి నిశ్చితార్థ వేడుకకు వేదికైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది మెహరీన్‌. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనుందని సమాచారం.

మెహరీన్‌కు కాబోయే వరుడు భవ్య బిష్ణోయ్ హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌కి మనవడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో తన ప్రేమ విషయాన్ని మెహరీన్‌ తెలియజేసింది. నాని కథానాయకుడిగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో మెహరీన్‌ తెలుగుతెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌2’ తదితర సూపర్‌హిట్‌ చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ‘ఎఫ్‌3’లో హనీగా సందడి చేయనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని