మెల్‌బోర్న్‌లో మరోసారిలాక్‌డౌన్‌ - melbourne orders snap coronavirus lockdown during australian open tennis
close
Published : 12/02/2021 22:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెల్‌బోర్న్‌లో మరోసారిలాక్‌డౌన్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరం మెల్‌బోర్న్‌లో కరోనా కారణంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. శుక్రవారం నుంచి ఐదురోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. విక్టోరియా రాష్ట్రం అంతటా లాక్‌డౌన్‌ను అమలుచేయనున్నారు. మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ ప్రేక్షకులు లేకుండా కొనసాగనుంది. పాఠశాలలు, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. విమానాల రాకపోకలు నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌ మెల్‌బోర్న్‌ విమానాశ్రయం హోటళ్లో వెలుగుచూసింది. అది 13 మందికి సోకడంతో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ నిబంధన మెల్‌బోర్న్‌లో ఇప్పటికే అమలవుతోంది.

ఇవీ చదవండి...

అంతవరకు హెచ్‌1బి వీసాలివ్వొద్దు

చైనా.. యూకే.. మీడియా యుద్ధం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని