Covid: ఆ చిన్నారులకు రక్షణ కల్పించండి - mha asks states to protect orphaned children due to covid
close
Published : 21/05/2021 18:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid: ఆ చిన్నారులకు రక్షణ కల్పించండి

రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

దిల్లీ: రెండో దశలో కరోనా రక్కసి ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటుంటే వారినే నమ్ముకున్న కుటుంబ సభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. కరోనా కారణంగా ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఒంటరైన పిల్లలు, మహిళలు అక్రమ రవాణా ముఠాలకు చిక్కకుండా వారికి రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేందపాలిత ప్రాంతాలకు సూచించింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, షెడ్యూల్ కులాలు/తెగలతో సహా బలహీన వర్గాలను పరిరక్షించేలా విధి విధానాలను పేర్కొంది.

కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకుంటామని ఇటీవల సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కన్పిస్తున్నాయి. అయితే ఇలాంటి దత్తతలు వేధింపులు లేదా పిల్లల అక్రమ రవాణాకు దారితీయొచ్చని పలు ఎన్జీవోలు, చిన్నారుల రక్షణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నేడు లేఖ రాసింది. కరోనా కారణంగా అనాథలైన చిన్నారులు, ఆసరా కోల్పోయిన వృద్ధులు, ఒంటరి మహిళలకు రక్షణ కల్పించేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో మహిళల కోసం హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని, లాయర్లు, సైకాలజిస్టులను అందుబాటులో ఉంచి వారికి మానసికంగా అండగా ఉండాలని పేర్కొంది. ఇందుకోసం కేంద్రం విడుదల చేసిన రూ. 107కోట్ల నిధులను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇక ప్రతి జిల్లాలో యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం రూ. 100కోట్లు విడుదల చేసినట్లు గుర్తుచేసింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని