ప్రధాని.. మీ చేతులకు నెత్తురంటింది - michael slater harsh comments on pm scott morrison and australian government
close
Published : 04/05/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రధాని.. మీ చేతులకు నెత్తురంటింది

ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఐపీఎల్‌ వ్యాఖ్యాత మైఖేల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో కరోనా రెండో దశ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణ విమానాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. మే 15 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. అయితే, తాజాగా ఈ విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన ఐపీఎల్‌ వ్యాఖ్యాత మైఖేల్‌ స్లేటర్‌ తన ట్విటర్‌లో ఆస్ట్రేలియా ప్రభుత్వం, ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ను ఉద్దేశించి ‘మీ చేతులకు నెత్తురు అంటింది’ అని పేర్కొన్నాడు.

‘ఆస్ట్రేలియా ప్రభుత్వం మా క్షేమం గురించి ఆలోచిస్తే మమ్మల్ని తిరిగి స్వదేశానికి అనుమతించేది. ఇది మమ్మల్ని తక్కువ చేసి చూడటమే. ప్రధాని.. మీ చేతులకు నెత్తురు అంటుకుంది. మమ్మల్ని ఇలా చిన్నచూపు చూడటానికి మీకెంత ధైర్యం. మీరు క్వారంటైన్‌ విధానాన్ని ఎలా అవలంబిస్తారు? ఐపీఎల్‌ కోసం పనిచేసేందుకు నాకు ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ, ఇప్పుడదే ప్రభుత్వం నన్ను చిన్నచూపు చూస్తోంది’ అని మేఖేల్‌ రాసుకొచ్చాడు.

కాగా, భారత్‌లో గతనెల 9 నుంచి ఐపీఎల్‌ 14వ సీజన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బ్రెట్‌లీ, మైఖేల్‌ స్లేటర్‌తో పాటు పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం ఇందులో పాల్గొన్నారు. అయితే, టోర్నీ మొదలయ్యాక దేశంలో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. దాంతో నిత్యం లక్షలాది కేసులు,  వందల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా.. భారత్‌ నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు గతవారం ఐపీఎల్‌లో ఆడుతున్న ముగ్గురు ఆస్ట్రేలియా  ఆటగాళ్లు తిరిగి స్వదేశం చేరుకున్నారు. అదే సమయంలో అక్కడి ప్రధాని మారిసన్‌ మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఆడుతున్న ఆసీస్‌ క్రికెటర్లు.. టోర్నీ ముగిశాక తిరిగి స్వదేశానికి రావాలంటే సొంత ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే మైఖేల్‌ ఇలా ఘాటుగా స్పందించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని