అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?: వాన్‌ - michael vaughan calls it ridiculous about england and wales cricket boards investigation
close
Published : 10/06/2021 22:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?: వాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఇయాన్‌ మోర్గాన్‌, జోస్‌ బట్లర్‌ 2018లో భారత యువ ఆటగాళ్లను కించపరుస్తూ ట్వీట్లు చేశారనే ఆరోపణలు రావడంతో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, దాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. మోర్గాన్‌, బట్లర్‌, అండర్సన్‌ ట్వీట్లు చేసినప్పుడు ఎవరూ వాటి గురించి మాట్లాడలేదని, అలాంటిది కొన్నేళ్ల తర్వాత అవి ఇప్పుడు తప్పుగా కనిపించడం విచిత్రంగా ఉందని మాజీ క్రికెటర్‌ తన వాదనలు వినిపించాడు. ఇది చాలా హాస్యాస్పదమైనదని, అప్పుడెప్పుడో చేసిన వాటికి ఇప్పుడు తప్పులు ఎంచడం సరికాదని అన్నాడు. ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఈ విచారణను నిలిపివేయాలని కోరాడు.

గతవారం ఇంగ్లాండ్‌ యువ క్రికెటర్‌ ఒలీ రాబిన్‌సన్‌ న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడుతుండగా.. అతడు 2012-13 కాలంలో యుక్తవయసులో ఉండగా జాతి విద్వేష, లైంగిక పరమైన ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాంతో ఈ విషయంపై విచారణ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఆ టెస్టు అనంతరం అతడిపై నిషేధం విధించింది. ఈ క్రమంలోనే తాజాగా మోర్గాన్‌, బట్లర్‌.. 2018లో ‘సర్‌’ అని పేర్కొంటూ భారతీయుల యాస, భాషను వెక్కిరిస్తూ చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి. దాంతో వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు వారిపైనా పూర్తి దర్యాప్తు జరిపి నిజనిజాలు తెలుసుకొంటామని చెప్పింది. అవసరమైతే చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు అండర్సన్‌ 2010లో స్వలింగ సంపర్క విషయంలో ఓ ట్వీట్‌ చేయడం కూడా తాజాగా బయటకు పొక్కడం గమనార్హం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని