ఇంగ్లాండ్‌లో గెలిస్తే భారత్‌ అత్యుత్తమ జట్టు  - michael vaughan says if team india win in england they are without doubt the best team of this era
close
Published : 07/03/2021 11:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌లో గెలిస్తే భారత్‌ అత్యుత్తమ జట్టు 

అందుకు టీమ్‌ఇండియా సాధన చేయాలి: మైఖేల్‌ వాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: స్వింగ్‌ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియా గెలిచినప్పుడు టెస్టుల్లో అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని, అప్పుడు అందులో ఎలాంటి సందేహం ఉండదని ఆ జట్టు మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా మొతేరా స్టేడియంలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అగ్రస్థానం సంపాదించి న్యూజిలాండ్‌తో తుది పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇక తాజాగా స్పందించిన వాన్‌.. టెస్టుల్లో టీమ్‌ఇండియా చాలా బాగా మెరుగైందని కొనియాడాడు. మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల ఆ పిచ్‌పై విమర్శలు గుప్పించిన అతడు ఇప్పుడు భారత జట్టు ప్రదర్శనను ప్రశసించాడు. ‘గత మూడు టెస్టుల్లో భారత్‌.. ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఒకవేళ ఇంగ్లాండ్‌లోనూ గెలిస్తే అప్పుడు భారత్‌ ఈ శకంలో అత్యుత్తమ టెస్టు జట్టుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా జరగాలంటే స్వింగ్‌ బంతులు ఆడటంలో భారత ఆటగాళ్లు కష్టపడాలి’ అని వాన్‌ ట్వీట్‌ చేశాడు. కాగా, జూన్‌లో ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆపై ఆగస్టులో ఇంగ్లాండ్‌లోనే ఆ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. దీంతో అక్కడ గెలవాలని వాన్‌ చెప్పకనే చెప్పాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని