WTC Final: భారత్‌ మయాంక్‌ను మర్చిపోవద్దు! - mike hesson feels team india should also consider mayank agarwal in the wtc final vs new zealand
close
Published : 10/06/2021 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Final: భారత్‌ మయాంక్‌ను మర్చిపోవద్దు!

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చేవారం న్యూజిలాండ్‌తో జరిగే తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా మయాంక్‌ అగర్వాల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని కివీస్‌ మాజీకోచ్‌ మైక్‌ హెసన్‌ సూచించాడు. ఇదివరకే న్యూజిలాండ్ పేసర్లను ఎదుర్కొన్న అనుభవం అతడికి ఉందని, అందువల్లే తుది జట్టులోకి పరిగణించాలని సెలవిచ్చాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన సందర్భంగా హెసన్‌ తన అభిప్రాయాన్ని బలంగా వినిపించాడు.

‘భారత్‌ కచ్చితంగా రోహిత్‌ శర్మ- శుభ్‌మన్‌గిల్‌తో ఓపెనింగ్‌ చేయించే అవకాశం ఉంది. అయితే, మయాంక్‌ను కూడా తుది జట్టులో ఆడించాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గతేడాది కివీస్‌ పర్యటనలో అతడు రెండు టెస్టులు ఆడాడు. దాంతో న్యూజిలాండ్‌ పేసర్లను ఎదుర్కొన్న అనుభవం కాస్త అయినా అతడికి ఉండి ఉంటుంది’ అని హెసన్‌ పేర్కొన్నాడు. కాగా, ఆ సిరీస్‌లో మయాంక్‌ రెండు టెస్టుల్లో కలిపి 34, 58, 7, 3 పరుగులే చేశాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో 17, 9, 0, 5, పరుగులు చేసిన మయాంక్‌ చివరిదైన గబ్బా టెస్టులో 38, 9 పరుగులు చేశాడు. దాంతో టీమ్‌ఇండియా అతడిని ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌కు దూరం చేసింది. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కూ ఎంపికయ్యాడు. అయితే, తుది జట్టులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అతడిని ఆడించాలని హెసన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని