ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొవిడ్ చికిత్స: ఈటల - minister eatala rajender discussion with private hospitals managements
close
Updated : 10/04/2021 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొవిడ్ చికిత్స: ఈటల

వైద్య కళాశాలల యాజమాన్యాలతో ఈటల భేటీ


హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్ చికిత్సలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలతో ఈటల సమావేశమయ్యారు. కొవిడ్‌ చికిత్సలు, ఆస్పత్రుల్లో పడకల ఛార్జీలు, సిబ్బంది కేటాయింపు, ఫీజుల వసూళ్లపై వారితో చర్చించారు. సరిపడా పరికరాలు, ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరగా.. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. పీపీఈ కిట్లు లేకుండా కేవలం మాస్కు ధరించి వైద్యులు రోగుల వద్దకు వెళ్లగలుగుతున్నారని.. గతంలో మాదిరిగా అందరికీ పీపీఈ కిట్లు అవసరం లేదన్నారు.

‘‘రాష్ట్రంలో మరోసారి కరోనా కేసుల పెరుగుదల నమోదవుతోంది. మహారాష్ట్రలో కొవిడ్‌ కోరలు చాస్తోంది. సరిహద్దు రాష్ట్రం కావడంతో తెలంగాణలోనూ వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంది. కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి ఏమాత్రం సహించేది లేదు. శుభకార్యాలు, బహిరంగ సభలు, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు. వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిందే. రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉండవు. కేసులు పెరిగితే అన్ని చర్యలకు సన్నద్ధంగా ఉన్నాం.

ప్రభుత్వ పరిధిలో కావాల్సినన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రులకు కావాల్సిన మందులను ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఆయా ఆస్పత్రుల్లో ఉచితంగా కొవిడ్‌ చికిత్సలు అందిస్తాం. 50 పడకలు మించి వసతులున్న ఆస్పత్రుల్లో శక్తి మేరకు చికిత్స అందిస్తారు. పాత జీవో ప్రకారమే సేవలు అందించాలని కార్పొరేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశాం. 14 వేలకు పైగా పడకలు ప్రైవేటు మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో ఉన్నాయి. వాటన్నింటికీ మేమే మందులు అందిస్తాం. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం కొత్త యంత్రాలు, రీజెంట్‌లు కొనాలని సీఎం ఆదేశించారు. యాంటిజెన్ టెస్టులో 90 శాతానికి పైగా సత్ఫలితాలు వస్తున్నాయి’’అని ఈటల తెలిపారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని