మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ - minister jagadish reddy campaign in sagar
close
Updated : 13/04/2021 13:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ

అనుముల‌: నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. అనుముల మండలం కొత్తపల్లిలో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై మంత్రి జగదీశ్‌రెడ్డిని నిలదీశారు. ప్రచారం ముందుకు సాగకుండా అడ్డుకున్నాడు. టీచర్‌ నిలదీతపై ఆగ్రహించిన మంత్రి ‘‘నీలాంటి వారిని చాలా మందిని చూశా. నీతో పాటు మీ నాయకులపై కఠినంగా వ్యవహరిస్తాం’’ అని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రైవేటు టీచర్‌ను పక్కకు లాక్కెళ్లడంతో జగదీశ్‌రెడ్డి ప్రచార వాహనం ముందుకు సాగింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని