నిమజ్జనానికి వచ్చేవారు స్వీయ జాగ్రత్తలు పాటించాలి: మంత్రి తలసాని - minister talasani srinivas yadav on ganesh immersion arrangements
close
Updated : 19/09/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిమజ్జనానికి వచ్చేవారు స్వీయ జాగ్రత్తలు పాటించాలి: మంత్రి తలసాని

హైదరాబాద్‌: గణనాథుల నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కొవిడ్  నిబంధనల మేరకు నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలో గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా అన్ని శాఖలను అప్రమత్తం చేశామని తెలిపారు. నిమజ్జనం కోసం పెద్ద ఎత్తున ప్రజలు ట్యాంక్‌బండ్‌ వద్దకు వచ్చే నేపథ్యంలో.. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తగిన స్థాయిలో క్రేన్లు కూడా ఉన్నాయని వివరించారు. ప్రమాదాలు సంభవించకుండా గజ ఈతగాళ్లు, పడవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని